About Us — Stock Market Telugu | Viraj

Telugu stock market Telugu mentor Viraj

 నేను Viraj — గత 8 సంవత్సరాలుగా Full-Time Stock Market Trader గా పనిచేస్తున్నాను. ప్రధానంగా Nifty Options Selling స్ట్రాటజీలపై ఫోకస్ చేస్తూ, నా ట్రేడింగ్‌ని Python ఆధారిత Algo Bots ద్వారా systematic గా, disciplined గా నిర్వహిస్తున్నాను.

ఇది కాకుండా, నేను FinViraj.com అనే స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌ని కూడా నడుపుతున్నాను, అక్కడ ఇప్పటివరకూ 3,000+ మంది స్టూడెంట్స్కి Stock Market, Futures & Options, Options Selling, Swing Trading వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చాను. YouTube, Telegram, Instagram ద్వారా వేలాదిమందికి తెలుగులో స్టాక్ మార్కెట్ కాన్సెప్ట్స్‌ని సులభంగా అర్థమయ్యేలా చెప్తూ వచ్చాను.

ఈ ప్రయాణంలో నేను గమనించిన ఒక ప్రధాన సమస్య ఏంటంటే — తెలుగులో స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, నాణ్యమైన, పూర్తి స్థాయి, ఉచిత కంటెంట్ దొరకడం చాలా కష్టం. చాలామంది ఇంగ్లీష్ కంటెంట్‌ని అర్థం చేసుకోలేక, లేదా ఖరీదైన కోర్సులు కొనలేక మధ్యలోనే ఆగిపోతున్నారు.

అందుకే Stock Market Teluguని ప్రారంభించాను — నా 8 సంవత్సరాల ట్రేడింగ్ అనుభవాన్ని, 3000+ మంది స్టూడెంట్స్‌కి బోధించిన అనుభవాన్ని జోడించి, భారత స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన ప్రతి అంశాన్నీ — Basics నుండి Advanced Options Strategies వరకు — పూర్తిగా తెలుగులో, ఎలాంటి ఛార్జీ లేకుండా అందించడానికి.

నా లక్ష్యం ఒక్కటే — డబ్బు కారణంగా గానీ, భాష అడ్డంకి కారణంగా గానీ, ఏ తెలుగు వ్యక్తి కూడా స్టాక్ మార్కెట్ నేర్చుకునే అవకాశాన్ని కోల్పోకూడదు.

నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే, మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ గా మార్చే బాధ్యత మాది